30, జూన్ 2010, బుధవారం

తెలుగు లోని పదాలను హత్య చెయ్యకండి

గౌరవనీయులైన ఈనాడు ఎడిటర్ గారికి,

నమస్కారములతో పరదేశం నుంచి ఓ సదురు తెలుగు వాడు వ్రాయునది. మీ వెబ్ సైటునకు చాలా పాప్యులారిటి ఉంది. ఎక్కువమంది మీ సైటుని దర్శిస్తూ ఉంటారు. అలాంటి మీరు అందరికీ మార్గ దర్శకులుగా ఉండాల్సింది పోయి మీరే తెలుగులోని శ్రేష్టమైన పదాలకి తెగులు పట్టించేస్తే.. తెలుగు భాషపైన మమకారం కలిగిన ఓ తెలుగు అభిమానిగా ఉండపట్టలేక మీకు ఉత్తరం వ్రాస్తున్నాను.

నిజ్జంగా మీరు తెలుగు వారేనా అని నాకు ఓ అనుమానం.. లేదా పరాయి రాష్ట్రం నుంచి వలస వచ్చి ఉద్యోగాలు చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులలాగా మీరు పరాయి భాష వారా!! లేక మీరు ఒఠి పేరుకు మాత్రమే ఎడిటర్ గారా అని నాకు చాలా అనుమానం.

ఇంకా ఎక్కువ వ్రాస్తే మిమ్ములను ధూషిస్తానేమో అని నాకు ఓ మూల శంకగా ఉంది. అసలు విషయాన్ని ఒక్క ముక్కలో వివరిస్తాను. ఇవ్వాల్టి ఆన్ లైన్ పేపర్లో, “వూరికో అద్దె” అంటూ ఓ ఆర్టికల్ వ్రాసారు. ఇలా చక్కగా ఉండాల్సిన “ఊరు” అనే పదం మీలాంటి వాళ్ళ వల్ల బ్రష్టు పట్టి వంకరై “వూరు” గా మారి దాని అసలు రూపాన్ని పోగొట్టుకుంటోంది.

భాషకు మీలాంటి వాళ్ళు ఎంత తెగులు పట్టించేస్తున్నారో ఒక్క సారి ఆలోచించండి. దయచేసి మీలాంటి వాళ్ళవల్ల కలిగే నష్టం ఎంత ఉందో గమనించండి. వూరు అనేపదం సరిఅయినది కాదు ఊరు అనేదే అసలు పదం అని ప్రక్కనున్న మరో తెలుగు వానికి చెబితే, ఈనాడే వేదం అన్నట్లుగా వాడు నాకు మీ సైట్ చూపించి, “అంటే నీ ఉద్దేశ్యంలో ఈనాడు వాడు తప్పు చేశాడంటావా.. “ అని ఎదురు ప్రశ్న వేస్తున్నాడు.

కాబట్టి వేడుకునేదేమిటంటే, మీరు తెలుగు భాషకి సేవ చెయ్యకపోయినా ఫరవాలేదు అంతే కాని హత్య చేసి సమాధి కట్టి.. మా పత్రిక ద్వారా తెలుగు భాషని వికృతి చేసి  తెగులు భాష చేసామని చంకలు కొట్టుకుంటానంటే మౌనంగా మీ పత్రికను త్యజించడం తప్పితే ఇంకేం చెయ్యలేను.

 

ఆ ఆవేదనను మన్నిస్తారని ఆశిస్తాను.

22, జూన్ 2010, మంగళవారం

ఐపిఎల్ ఫీవర్ నాకు ఉందా!!

ఉపోధ్ఘాతం : ఈ పుట అప్పుడెప్పుడో సగం వ్రాసి డ్రాఫ్ట్ గా సేవ్ చెయ్యబడి ఉంది. ఇదిగో ఇప్పుడు వీలు కలిగి మీముందుకు ఇలా..

-----------------

నా భార్య నాపైన చేసే కొన్ని కంప్లైంట్లలో ఒకటి నన్ను ఈ పుట వ్రాసే ప్రయత్నం చేసింది. నా భార్య మాటల్ని యధాతధంగా ఇక్కడ ఉంచడానికి ప్రయత్నం చేస్తాను..

ఇంటికి వచ్చిన తరువాత కాళ్ళు కడుక్కుని ఏదో రెండు ముక్కలు నాతో మాట్లాడతారని నేనుకుంటుంటే.. ఏదో పోయినోడిలాగా వచ్చీ రాగానే ఆ వెధవ టీవీ ముందు అలా అతుక్కు పోవడమేమిటో నాకర్దం కాదు.. ఇంతకీ షూ తీసారా!!! ఆ కాళ్ళు కంపు కొడుతున్నాయి పోయి కాళ్ళైనా కడుక్కు రండి.. ఈ లోపుల నేను వేడి వేడిగా తిండానికి ఏమైనా చేస్తాను.. ఏంటీ!! వింటున్నారా!! నేను చేప్పేవి వినబడుతున్నాయా!!

మన భారతంలో కొద్ది మందికి క్రికెట్ అనే ఆట ఒక మతంలాంటిది. క్రికెట్ ఆట జరిగుతోందంటే ఆ ఆట గురించి తెలిసిన వారెవ్వరైనా అడిగే మొదటి ప్రశ్నలలో కొన్ని, ఎవ్వరాడుతున్నారు.. ఎన్ని రన్స్ చేశారు.. ఎన్ని వికెట్లు పడ్డాయి.. ఎవ్వరెవ్వరు అవుట్ అయ్యారు.. వగైరా వగైరా.. అలాంటి వాళ్ళల్లో నేనూ ఉన్నాను.

 
Clicky Web Analytics