13, ఆగస్టు 2010, శుక్రవారం

అమెరికా అలవాట్లు / ఆచారాలు / పద్దతులు / ఇతరేతమైన పదాలు నాకు ఎప్పటికీ అర్దం కావనుకుంటా!!

అమెరికాలో నాకు నచ్చని మరో మూడు అంశాలు. అమెరికా అంటే ఇష్టం ప్రేమ అభిమానం తొక్క తోటకూర వంకాయ్ బెండకాయ్ గాడిద గుడ్డు గోంగూర వగైరా వగైరా ఉన్న వాళ్ళు ఈ పుటని చదవవద్దని మనవి. ఎందుకంటే ఇవి నాకు అనిపించిన నిజాలు. అవి మీకు నిష్టూరంగా మరియు వెటకారంగా అనిపిస్తాయి. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మిన్న.


మొదటిది.. ఎక్కడ ఏది చెయ్యాలో అక్కడ అది చెయ్యకుండా ఏదేదో చేస్తూ మరేదో చేస్తారు. అసలు విషయానికి వద్దాం.  ఇక్కడ నీరు సంవృద్దిగా దొరుకుతుంది. అందువల్లన వీరి ప్రకృతి సంపద చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా చక్కటి చెట్లు మంచి రోడ్లు. శీతాకాలం వస్తే మోకాలు ఎత్తుకు మంచు. అన్నీ బాగుంటాయి. అందువల్ల వీరు నీటిని చాలా శుద్ది చేసి వాడుకుంటారు. ఎంత శుద్ది చేసి అంటే, అచ్చంగా కుళాయి నుంచి వచ్చే నీటిని మనం యధావిధిగా త్రాగేయవచ్చన్నంతగా. నీరు ఇంత బాగా దొరుకుతున్నా, అన్ని పనులకు నీటిని వీరు వాడుతున్నా అసలైన చోట మాత్రం వీరు నీటిని వాడరు. ఎక్కడంటారా.. అదే అక్కడికే వస్తున్నా.. అది మల విశర్జన చేసి అశుద్దం అంటిన శరీరాన్ని నీటితో కడగరు సరికదా కాగితంతో తుడుచుకుని బయటకి వచ్చి, *డ్డిని నీటితో కడుక్కోరు కానీ *డ్డిని అంటిన చేతిని మాత్రం నీళ్ళతో కడుక్కుంటారు. అసలు అలాంటి చోట నీళ్ళను ఏర్పాటు చేసుకోరు. ఏమైనా అంటే కాగితంతో తుడుచుకున్నాంగా అంటారు.

అలాగే ఈ కాగితాన్ని తయారు చేసే కంపెనీలు విపరీతమైన రీసెర్చ్ చేసి మా కాగితంలో పది శాతం మాయిశ్చర్ ఉంటుంది, దీనితో కనుక మీరు తుడుచుకుంటే అది అచ్చంగా నీటితో కడిగినంత స్వఛంగా ఉంటుంది అని ప్రకటనలు చేస్తాయి. ఇదంతా ఎందుకొచ్చిన గొడవ చక్కగా నీటితోనే కడుక్కోవచ్చు కదా అంటే, అందరూ చేసింది మేము చేస్తే ఇక మా స్పెషాలిటిటీ ఏంటి? అని ఎదురు ప్రశ్నిస్తారు.

వీళ్ళలాగే వీళ్ళ పిల్లలు కూడా, నేను ఉంటున్న హోటల్లో నేను గమనించినది ఏమిటంటే.. ఉదయం నిద్ర లేవంగానే తినడానికి ఏమి ఉంది అంటూ క్రిందనున్న బ్రేక్ ఫాస్ట్ స్థలానికి వెళ్ళి ఏదో నోటికి పట్టినంత కుక్కుకుని ప్రక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి దూకుతారు. ఆడినంత సేపు ఆడి ఆ తరువాత మళ్ళీ నిద్రకు ఉపక్రమిస్తారు. మరి శారీరక శుబ్రత వంటి వాటి విషయాలేమిటంటే, గాడిద గుడ్డేం కాదు అంటూ మనల్ని వెధవల్ని చేస్తారు.


ఇక రెండవ విషయానికి వస్తే అది.. పెళ్ళి .. ఇక్కడ నేను కలిసిన ప్రతీ అమెరికన్ని కదిపితే, మగాడైతే ఇలా అంటూ ఉంటాడు.. "నా మొదటి పెళ్ళాం .. ఇప్పుడున్న పెళ్ళాం.. రేపు కనుక విడిపోతే మరో పెళ్ళాం .." ఇలా అనే వాడికి ముడ్డి క్రిందకి యాభై ఏళ్ళు వచ్చి ఉంటాయి అప్పుడు కూడా వీడికి కొత్త పెళ్ళాం కావల్సివస్తే, అమ్మాయిల పని మరోలా ఉంటుంది. నా మొదటి బాయ్ ఫ్రండ్ నా రెండో పెళ్ళికి వచ్చి త్రాగి తందనాలాడి తతంగం చేస్తే నా మొదటి మొగుడు వీడ్ని పట్టుకుని చితకొట్టాడు.. అంటారు. ఇవన్నీ ఏదో ఉత్తుత్తి వ్రాతలు అని మీరనుకుంటే ఈ మధ్య ఓ మాస్ మైల్ నాకు భలే నవ్వు తెప్పించింది. అదేదో పాత కమల హాసన్ సినిమాలో ఉన్నట్టుంది. ఆ మైల్ లోని సారంశం. వీలైనంత విపులంగా వ్రాయడానికి ప్రయత్నిస్తాను.. ఒక వేళ అర్దం కాకపోతే వదిలేయ్యండి. స్టోరి ఇలా సాగుతుంది

నేనెవ్వరు? మీకు తెలిస్తే చెప్పండి. . . . ఈ మధ్యకాలంలో నేనో విదవరాలితో కలసి సహజీవనం కానిస్తూ ఓ బిడ్డను కనే ఆలోచనలో ఉండగా ఆ విదవరాలి పెద్దమ్మాయి ఎవ్వరినో ఇష్ట పడి ఆపై కష్టపడి ఓ పిల్లని కన్న తరుణంలో ఆ పుట్టిన బిడ్డ శాక్షిగా పెళ్ళి చేసుకుంటున్నాను మీరు రావాలి అని మా ఇద్దరికి వెడ్డింగ్ కార్డ్ పంపింది. తీరా వెళ్ళి చూస్తె ఆ పెళ్ళి కొడుకెవ్వరో కాదు నాకు జన్మనిచ్చిన బయలాజిలక్ తండ్రి. అంటే నా తండ్రికి నేను ఇప్పుడు మామగారినన్నమాట మా నాన్నకు పుట్టిన ఆ బిడ్డకి నేను తాతనా లేక అన్ననా.. నా నాన్న నాకు అల్లుడా లేక నేను డేటింగ్ చేసే విధవరాలి కూతురు భర్తగా నా పెళ్ళాం కూతురు మొగుడైతే నాకు అల్లుడౌతాడు కదా .. అలా అల్లుడా లేక ..

ఇలా సాగుతుంది వావి వరుస లేని వీరి వృత్తాంతం. ఈ మధ్య ఇక్కడ జరిగే చెర్చి పెళ్ళిళ్ళలో అక్కడి ఫాదర్ ఈ విధంగా అడగటం మొదలు పెట్టారు..

ఫాదర్ అమ్మాయితో : ఏమ్మా!! జాన్ అనే ఈ అబ్బాయితో నీకు నచ్చినంత కాలం నీకు వీల్లున్నంత కాలం కలిసి ఉంటూ ఈయన ద్వారా మీకు కలిగిన ఆఫ్ స్ప్రింగ్ (అదేనండి తెలుగులో సంతానం)ని నీకు ఇష్టమున్నంత కాలం కాపాడటానికి నీకు ఇష్టమేనా..
అమ్మాయి : అవును..
ఫాదర్ అబ్బాయితో : ఏరా!! జాకీ అనే ఈ అమ్మాయితో నీకు నచ్చినంత కాలం / నీకు వీల్లున్నంత కాలం కలిసి ఉంటూ ఈమె ద్వారా మీకు కలిగిన ఆఫ్ స్ప్రింగ్ (అదేనండి తెలుగులో సంతానం)ని నీకు ఇష్టమున్నంత కాలం కాపాడటానికి నీకు ఇష్టమేనా..
అబ్బాయి : అలాగే కానీయ్యండి

వీళ్ళిద్దరు చెర్చి బయట ఇలా ఈ ఎగ్రిమెంట్ కి వచ్చి ఉంటారు. నాకు నీకు పిల్లలు కలిగితే మొదటి ఐదేళ్ళు నేను పెంచుతానని అమ్మాయి ఒప్పుకుంటే మరో ఐదేళ్ళు అబ్బాయి ఒప్పుకుంటాడు. ఆ తరువాత పుట్టిన పిల్లలకు యుక్త వయసొచ్చింది కాబట్టి వాడి సంపాదన వీళ్ళు సంపాదించుకుంటారు కాబట్టి అచ్చోసిన ఆంబోతులా వదిలేద్దాం. ఆ తరువాత మనమిద్దరం మరొకళ్ళని తగులుకుందాం .. వాకే!! అని ఒక ఎగ్రిమెంట్కి వచ్చుంటారు.

ఇక్కడ నేను వ్రాసేవన్నీ ఉత్తుత్తి వ్రాతలనుకునేవారు ఎప్పుడైనా ఒక నేటివ్ అమెరికన్ వ్యక్తిగత జీవితం ఏమిటో అడగండి అప్పుడు బయట పడుతుంది అస్సలు విషయం. ఇక్కడ ఓ పదేళ్ళు కలసి కాపురం చేసాము అన్నామంటే అదో గొప్ప విషయం అలాగే ఓ వింత విషయం కూడా.. ఇదే సంస్కృతి ఇప్పుడు మన దేశానికి దిగుమతి అయ్యి మన జీవనంలో ఓ చీడపురుగౌతోంది. ఆ విషయం గురించి మరో సారి.


ఇక ఈ పుటకి ఆఖరి పాయింట్.. అప్పాయింట్ మెంట్స్.. ఇప్పుడు పని చేస్తున్న కంపెనీలోని ఓ ఉద్యోగి తండ్రి మరణించిన విషయాన్ని నాతో చర్చిస్తూ ఇలా అన్నాడు..

.. మానాన్న ఫలాన రోజు ఉదయం పది గంటలకు హృదయ స్పందన ఆగిపోవడం వల్ల హాస్పిటల్లో కాలం చేసారు, ఆరోజు  మాకు లంచ్ ఎప్పాయింట్ మెంట్ ఉంది కదా అని నేను అక్కడకు చేరుకుంటే ఇంట్లో ఎవ్వరూ లేరే!! కనీసం నాకు చెప్పాలి కదా ఎక్కడికి వెళ్ళుతున్నారు అని. విషయం ఏమిటో అని తెలుసుకుందాం అని మా చెల్లెలికి ఫోన్ చేస్తే చావు కబురు చల్లగా అప్పుడు చెప్పింది ..

పైన వ్రాసిన పేరా ద్వారా చదివే వాళ్ళకు ఏమి అర్దం అయ్యిందో గాని నాకు మాత్రం ఓ విషయం అర్దం అయ్యింది. తండ్రితో  కలసి భోజనం చెయ్యాలంటే కొడుకులకు అప్పాయింట్‍మెంట్ కావాలని. ఇలాగయితే ఈ క్రింద చెప్పబోయే మాటలు నిజమవ్వడానికి ఎంతో కాలం పట్టదేమో!!

ప్రియమైన పెళ్ళానికి ఓ అమెరికన్ మొగుడు వ్రాయునది,
వచ్చే శనివారం సాయంత్రం ఏడు గంటలకు హిల్టన్ హోటల్లో మన ఇద్దరికి డిన్నర్ ఎరేంజ్ చేస్తున్నాను. ఓ గంటకి నాలుగు వందల డాలర్లు. ఇందులో రెండు వందల యాభై డాలర్లు నేను పెట్టుకుంటా మిగిలిన నూట యాభై డాలర్లు నువ్వు పెట్టుకోవలసి వస్తుంది. మనకు కేటాయించిన గంటలో ఓ అరగంట భోజనం చేస్తూ ఈ క్రింద వ్రాసిన లిస్టులోని విషయాలు మాత్రమే మాట్లాడుకుందాం మిగిలిన అరగంట సంసారం చేద్దాం. ఇందుకు నీకు ఇష్టమైతే ఈ మీటింగ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చెయ్యి లేక పోతే కాన్సిల్ కానీ / క్రొత్త ప్రపోజల్‍ని పంపించు.

మనం మాట్లాడుకోవాలని నాకు అనిపించిన విషయాల లిస్ట్

౧) మనకు పిల్లలు పుడితే ఎవ్వరెంతకాలం సాకాలి, సాకినందుకు ఎవ్వరు ఎవ్వరికి ఎంత ఇవ్వాలి

౨) ఎవ్వరెవ్వరికి ఏ ఏ కార్లు ఉన్నాయి, వాటిని ఎవ్వరు తయ్యారు చేసారు, వాటి ఇన్‍స్యూరెన్స్ ఎంత

౩) సంవత్సరాంతంలో వచ్చే వెకేషన్ ఎక్కడ జరుపుకోవాలి మరియు ఎంత ఖర్చు పెట్టాలి

ఇవి కాకుండా నీకేమైన ఉంటే ముందుగా నాకు తెలియ జేయి, నేను కొంచం ముందుగానే ప్రిపేర్ అయ్యి వస్తాను.
ఇక ఉంటాను

లవ్యా

ఇక మీ టైం మొదలైంది.. దేనికంటారా, స్పందనలకు.. ఆఖరుగా మరో విషయం మర్చిపోయ్యాను. ఇవ్వాళ 13th అందునా శుక్రవారం.. దీని వెనకాల మరో ఇస్టోరి.. అప్పటిదాకా మీ స్పందనలకై ఎదురు చూస్తూ ఉంటాను.

59 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

కానీ *డ్డిని అంటిన చేతిని మాత్రం నీళ్ళతో కడుక్కుంటారు....Super....

పానీపూరి123 చెప్పారు...

> ఇవ్వాళ 13th అందునా శుక్రవారం
http://en.wikipedia.org/wiki/Friday_the_13th
you are worrying about Phobia?

ఓ బ్రమ్మీ చెప్పారు...

ఆజ్ఞాత గారు,

స్పందనకు నెనరులు. మరో విషయం వ్రాద్దామనుకుని మర్చిపోయ్యాను. అదేమిటంటే.. *డ్డిని అంటిన చేతిని మాత్రం నీళ్ళతో కడుక్కుంటారుగా అని మనం అంటే, చేతికి *డ్డికి మధ్య టిష్యూ ఉందిగా కాబట్టి మరేం ఫర్లేదు అంటారు.

పానీపూరీ123 గారు,
వికీ వాడి లంకెను ఇచ్చినందులకు నెనరులు. అందులో ప్రస్తావించినవి కాకుండా మరో విషయం నాకు తెలుసు అది యూరప్ వాళ్ళకి సంబందించినది అనుమానం. పూర్తి వివరాలు మరోసారి వ్రాస్తాను. పాయింట్ కాచ్ చేసినందుకు థాంక్స్

Malakpet Rowdy చెప్పారు...

ప్పుడైనా ఒక నేటివ్ అమెరికన్ వ్యక్తిగత జీవితం ఏమిటో అడగండి అప్పుడు బయట పడుతుంది అస్సలు విషయం.
_____________________________________

Native Americans?

ఓ బ్రమ్మీ చెప్పారు...

రౌడీ గారు,

నేటివ్ అమెరికన్ అంటే గత యాభైఏళ్ళలో వీరి వంశంలో ఎవ్వరూ బయటినుంచి వచ్చినవారు కాదు అని నా అభిప్రాయం. ఆలాగున ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చచ్చే రకం అన్నమాట అంతే గాని ఇండియానుంచి లేదా మరే దేశాన్నుంచి తండ్రుల తరం వలస వచ్చిన తరువాత ఇక్కడ పుట్టిన కొడుకులు / కూతుళ్ళ విషయం కాదు నేను చెబుతున్నది. అర్దం అయ్యిందనుకుంటాను.

అజ్ఞాత చెప్పారు...

మీరు చెప్పిన పాయింట్స్ కొన్ని కరెక్టే అయినా, కొన్నింటిలో వీల్లే బెటర్ ఏమో అనిపిస్తుంది. ముఖ్యంగా పెళ్ళి విషయంలొ మాత్రం, ఎందుకంటే వాళ్ళకు ఇష్టంలేక పోయినా, లేక కలిసి జీవించలేము అనుకున్నప్పుడు డైరెక్ట్ గా చెప్పేసి ఇంకొకరిని చేసుకుంటారు గాని మన వాళ్ళలాగ వాళ్ళను చంపేసో లేక కిరోసిన్ పొసి తగులబెట్టో వాళ్ళ జీవితాలను నాశనం చెయ్యడానికి మాత్రం ప్రయత్నించరు.

ఓ బ్రమ్మీ చెప్పారు...

రెండో అజ్ఞాత గారు,

వివాహం అనేది ఎంతో పవిత్రమైన విషయం అలాంటి విషయాన్ని నవ్వుల పాలు చేస్తున్న వీళ్ళ సాంప్రదాయం నాకు నచ్చలేదు. ఇక పోతే మీరు ప్రస్తావిస్తున్న చంపుకోవడం తగలబెట్టుకోవడం మన భారత సంస్కృతిలో లేదు .. ఎటొచ్చి కొంతమంది వికృతంగా ఆలోచించే వాళ్ళు ఇతరులను హింసించి ఆనందించే సైకోలు మన సంస్కృతిలో ఈ మధ్య చీడపురుగుల్లా చేరుతూ మీలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. విడాకులు అనేది ఏ జాతిలోనూ లేదా ఏ మతం లోనూ లేదని నా అభిప్రాయం. తలాక్ తలాక్ తలాక్ అని విడిపోవచ్చు అన్న ఒక్క ముస్లిం వర్గం గురించి నాకు ఈ ఒక్క ముక్క తప్ప మరింకేం తెలియనందువల్ల ముస్లిమేతరులలో ఎవ్వరూ విడాకులను హర్షిస్తారనుకోను.

ఇక కలసి జీవించడం వెనకాల ఎంతో సహనం అలాగే ఎంతో త్యాగం దాగి ఉంది అన్న విషయం వీళ్ళకు అర్దం కాదు. వీళ్ళకు కావలసినది అల్లా క్షణికావేశం అలాగే క్షణికానందం. అంతే కాని కష్టమైనా నిష్టూరమైనా కలిసి బ్రతుకుదాం, చచ్చేంత వరకూ నీకు నేను నాకు నువ్వు అలాగే ఒకరికి ఒకరం అన్న ఆలోచన వీరి దృష్టిలో ఓ ఫూలీష్ ఐడియా

శరత్ కాలమ్ చెప్పారు...

@ అజ్ఞాత
మీరు చెప్పింది నిజం. భారత్ లో భార్య అనుమతి లేకుండా విడాకులు తీసుకోవడం కష్టం కాబట్టి చంపి అయినా ఎలాగోలా పీడా విరుగడ చేసుకునేవాళ్ళున్నారు. ఇండియాలో కూడా విడాకులు సులభతరం చేస్తే ఇలాంటి మరణాలు తక్కువ అవుతాయి.

ఓ బ్రమ్మీ చెప్పారు...

శరత్ గారు,

అస్సలు విడాకులే మంచిది కాదు సారు అంటూ నేను మొత్తుకుంటూ ఉంటే, మీరేంటండి చట్టాలు చుట్టాలు బుట్టాలు అంటారు.. ఒకానొక రోజుల్లో విడాకులు లేని సమాజం మన భారతదేశం. అలాంటి రోజు మళ్ళీ రావాలని నా కోరిక.

అజ్ఞాత చెప్పారు...

meeru ee midi midi janaanapu raatalu taggimchaali. madhyalo native americans ni emduku laagutaaru? vaallaki mee kamte ekkuve viluvalu telsu, paatistaaru.

ee m*ddi obsession emiti prati tapaa lonoo. *ddi kadukkodam kaadu, mumdu mee mooti kadukkomdi.

అజ్ఞాత చెప్పారు...

>> ఒకానొక రోజుల్లో విడాకులు లేని సమాజం మన భారతదేశం. అలాంటి రోజు మళ్ళీ రావాలని నా కోరిక.
ఆశలు వుంటాయి అందరికీ
కాని నెరవేరేది ఎందరికి?
కొందరికి, కొందరికి

మీ ఆవిడ రోజూ వేపుకు తినకుండా పతిసేవయే పరమార్థమని భావిస్తూ, మీ అమ్మ నాన్నలకి వూడిగం చేస్తూ వుంటే మీరలా ఆకాన్షించడం తప్పులేదు.
అదే అప్పడాలకర్రతో మోదుతూ, మూతి తిప్పుతూ, మూలుగుతూ, చీటికి మాటికి ముక్కుచీదుతూ, మీకెవరో అక్రమసబంధం వుందని నిలదీస్తూ వుంటే .. నా సామిరంగ , అపుడొస్తుందో త్యాగరాజ కృతి,ఓ పదం -
" ఏటీ జన్మం బిదిరా! ఓ రామా! "
" ఏమిచేతురా లింగా నేనేమి చేతు" :)

కడుపునిండిన యవ్వారం బానే వుంటుంది బాబూ, భవా ( బావ కాదు, వుడుక్కోకు ), ఏదో అభిమానం కొద్దీ అలా పిలవాలనిపిస్తోంది.
ఇంతకీ అమెరికాలో ఇన్నాళ్ళు కడుక్కోక వచ్చినందుకు మీ ఆవిడ నిన్ను మోకాళ్ళ మీద అట్లకాడతో ఫిడేల్ వాయించినట్టు లేదు. :)

అభిమాని

Malakpet Rowdy చెప్పారు...

LOL...


Native Americans are the tribals whose ancestors belonged to the region even before Columbus stepped on their soil.

(Also called American Indians or even Red Indians)

Malakpet Rowdy చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Malakpet Rowdy చెప్పారు...

http://en.wikipedia.org/wiki/Native_Americans_in_the_United_States

సుజాత వేల్పూరి చెప్పారు...

చక్రవర్తి గారూ,
నేటివ్ అమెరికన్స్ అంటే? రెడ్ ఇండియన్స్ గురించా మీరు చెప్పేది?ఒక్లహోమా లో వీళ్ళు మా చుట్టాలుగా ఉండేవాళ్ళు! (చుట్టుపక్కల)

మొదటి రెండొ మూడో భర్త/భార్య ల విషయానికొస్తే...కుటుంబ సంబంధాల విషయంలో అమెరికాలో ఇలాంటి వైరుధ్యాలు మామూలే!(ఎన్ని కుటుంబాలను ని గమనించారు అని ఎవరైనా వస్తారేమో ...నాకు తెలిసి నేను మా స్నేహితుల్లోనే ముగ్గురున్నారు ఇలాంటి మల్టిపుల్ రిలేషన్స్ తో )ఇలాంటపుడే భారతీయ కుటుంబ వ్యవస్థ మీద గౌరవం కలిగేది.

నేను చదివి,చుట్టుపక్కల చూసి గమనించింది(కేవలం నా అబ్సర్వేషన్)ఏమిటంటే కుటుంబ బంధాల విషయంలో నల్ల అమెరికన్స్,హిస్పానిక్ లు తెల్లోళ్ల కంటే బెటర్ అని!(సైంటిఫిక్ రీసెర్చ్ కాదు కాబట్టి తప్పు కూడా కావొచ్హు నా పరిశీలన)

ఇహ నీళ్ళూ, టిష్యూ పేపరూ....! అమెరికా ఏంటి స్వామీ, ఇండియాలో కూడా పెద్ద షాపింగ్ మాల్స్ కెళ్ళి చూడండి..అక్కడ టాయిలెట్స్ లో ఉండేది ఈ చుట్టలే! కాకపోతే ఇక్కడ నీళ్ళ సేవింగ్ కోసం అలా పెడతారు. లేకపోతే మనోళ్ళు టాప్ తిప్పి వెళ్ళిపోయే రకం కదా!

మీరు త్వరగా ఇండియా వస్తే మరిన్ని విశేషాలు తెలుసుకోవాలని ఉంది అమెరికా గురించి!

తెలుగు శూరుడు చెప్పారు...

One thing I don't understand. While this author craves for a healthy family system and a conducive atmosphere, why do some want to divert the topic to extreme and rare criminal situations ? Why do they subject him to verbal abuse without substantiating their criticism with proper data inputs and logic ?

They are seem to be arguing that the ideal family system is absolutely undesirable for anyone in the society because there are some rare criminal personalities in the society. My question to them is, how can you base youe recommendations on unpredictable situations ? Shall we ban all air travel just because there are air-crashes ?

All Americans are dirty selfish assholes and pure presentists like animals and mosquitoes. They can't think even for a single generation forward beyond the immediate moment. Their family system is just a functioning anarchy, if at all it can be called as one.

తెలుగు శూరుడు చెప్పారు...

Dear Sir ! Please keep this one and remove the above comment of mine because I find some typographical mistakes therein which I overlooked while pressing the PUBLISH button..

One thing I don't understand. While this author craves for a healthy family system and a conducive atmosphere, why do some want to divert the topic to extreme and rare criminal situations ? Why do they subject him to verbal abuse without substantiating their criticism with proper data inputs and logic ?

They seem to be arguing that the ideal family system is absolutely undesirable for anyone in the society because there are some rare criminal personalities in the society. My question to them is, how can you base your recommendations on unpredictable situations ? Shall we ban all air travel just because there are air-crashes ?

All Americans are dirty selfish assholes and pure presentists like animals and mosquitoes. They can't think even for a single generation forward beyond the immediate moment. Their family system is just a functioning anarchy, if at all it can be called as one.

అజ్ఞాత చెప్పారు...

ఇంగ్లీషు అనర్గళంగా రాశావురా అబ్బాయి. నీపేరు తెలుగుశూరుడు అనేకన్నా ఇంగ్లీషు వీరుడు అని అంటే బావుంటుందబ్బాయ్.

అజ్ఞాత చెప్పారు...

చక్రవర్తి గారు, మీకు ఈ అమెరికా గురించి రాయటం అచ్చొచ్చినట్టు లేదండీ. పాపం కేబ్లాస వారు మిమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తున్నట్టున్నారు.

amma odi చెప్పారు...

>>>ఇక కలసి జీవించడం వెనకాల ఎంతో సహనం అలాగే ఎంతో త్యాగం దాగి ఉంది అన్న విషయం వీళ్ళకు అర్దం కాదు. వీళ్ళకు కావలసినది అల్లా క్షణికావేశం అలాగే క్షణికానందం. అంతే కాని కష్టమైనా నిష్టూరమైనా కలిసి బ్రతుకుదాం, చచ్చేంత వరకూ నీకు నేను నాకు నువ్వు అలాగే ఒకరికి ఒకరం అన్న ఆలోచన వీరి దృష్టిలో ఓ ఫూలీష్ ఐడియా.

చక్రవర్తి గారు: బాగా చెప్పారు!నెనర్లు!

ఓ బ్రమ్మీ చెప్పారు...

మూడో అజ్ఞాతగారు,
మొదటగా.. నేను ఇంతకు ముందే చెప్పాను. ఇక్కడికి నేను ఒక విజిటర్ వేషంలో ఉన్నాను, నాకు వీరి గురించి తెలిసింది మాత్రమే వ్రాస్తున్నా అని. ఆ విషయం మీరు చూసినట్టు లేరు. అందుకని మీరు మీ ఆవేశాన్ని కొంచం తగ్గించుకోవాలి. ఇక నేటివ్ అమెరికన్స్ విషయానికి వస్తే, వీళ్ళకు ఉన్న విలువలేమిటో నాకు అర్దం కాలేదు కాబట్టి మీకు వీలైతే వ్రాయండి చదువుతాను.
ఇక నా అబ్‍సెషన్ విషయానికి వస్తే ఈ విషయం ప్రతీ టపాలోనూ ఉందని నేననుకోవటం లేదు ఇంతకు మ్రుందు ఒక్క సారి మాత్రమే వ్రాసినట్టు గుర్తు. అలా కాకుండా ఇంకా ఎక్కువగా ఎన్ని సార్లు ఉదాహరించానో చెప్పగలరా.. ఇక నా మూతి విషయమంటారా.. చూద్దాం నాకు ఇంకా అర్దం కాలేదు ఏ విషయంలో కడుక్కోవాలో, అర్దం అయ్యిన తరువాత ప్రయత్నిస్తా.

ఓ బ్రమ్మీ చెప్పారు...

సుజాత గారు,

భారతీయ కుటుంబ వ్యవస్థపై మీకున్న గౌరవానికి చాలా సంతోషంగా ఉంది. నా ఉద్దేశ్యం కూడా ఇదే. నా అభిప్రాయంలో నాకు ఇలాంటి మల్టిపుల్ రిలేషన్స్ అంటేనే చికాకు. అలాంటిది వీళ్ళు అదేదో పెద్ద గొప్పగా నాకు ఇంతకు మ్రుందు ఇద్దరు పెళ్ళాలు ఇప్పుడు నలుగురు పిల్లలు ఒకరు మొదటి భార్యకు పుడితే ఒకరు ఇప్పుడున్న భార్యకు పుట్టగా మరొకరు ఇప్పుడున్న భార్యకి మొదటి మొగుడుకి పుట్టిన వాడైతే ఆఖరి వాడు మొదటి భార్య మొదటి మొగుడు సంతానం అని చెబుతుంటే కంపరం పుడుతుంది.
ఏది ఏమైనా స్పందించినందులకు నెనరులు

ఓ బ్రమ్మీ చెప్పారు...

అయ్యా తెలుగు శూరుడు గారు,

మున్ముందుగా పేరేమో తెలుగు శూరుడు వ్రాసినదేమో ఆంగ్లం ఇలా ప్రవర్తనకు తగ్గ పేరు పెట్టుకోకుండా ఏదేదో స్పందించినందులకు కాకపోయినా ఇంత పెద్ద స్పందనలో నాలుగు ప్రశ్నలు సంధించినందులకు నెనరులు. ఇక మీ ప్రశ్నల విషయంలో నా జవాబులు..

౧?కి జవాబు) నేను టాపిక్‍ని రేర్ క్రిమినల్ సిట్యువేషన్స్ వైపు డైవర్ట్ ఎక్కడ చేసానో చెప్పగలరా..

౨?కి జవాబు) ఇది బ్లాగు ప్రపంచం మీకు ఇష్టమైన విషయాన్ని ఇష్టమైన విధంగా వ్రాసుకోవచ్చు. కాకపోతే అవి జన నష్టానికి కాని జాతి నష్టానికి గాని దారి తీయ్యకూడదు అంతే. ఆ విధంగా నేను వ్రాయలేదు కావున ఎవ్వరు వారికి ఇష్టమైన స్పందనను తెలియ జేయవచ్చు, మీరు చేసినట్టు. అంతే కాకుండా మీ ఈ ప్రశ్న నాకు అరం కాలేదు కొంచం వివరించండి.
౩?కి ఎదురు ప్రశ్న) అన్‍ప్రిడిక్టబుల్ సిట్యువేషన్స్ అంటే మీ ఉద్దేశ్యంలో ఎలాంటివో చెప్పగలరా..
౪?కి సమాధానం) ఇక్కడ ఎవ్వరూ జెడ్జిమెంట్ ఇవ్వటం లేదు వారు వారు అభిప్రాయాలను తెలియ జేస్తున్నారు. అంతే కాబట్టి మీ ప్రశ్న ఇక్కడ అప్రస్తుతం
అమెరికన్స్ పై మీకున్న అభిప్రాయాన్ని తెలియ జేసినందులకు నెనరులు. ఇలాగే ప్రతీ విషయంపై స్పందిస్తూ తెలుగుని నేర్చుకుంటారని ఆశిస్తాను

ఓ బ్రమ్మీ చెప్పారు...

నాల్గొవ అజ్ఞాత గారు,

ఆశలు నెరవేర్చుకోవాలన్న తపన ఉన్న అందరికీ నెరవేరడానికి ప్రయత్నం చేసే అందరికీ ఇది వర్తిస్తుంది అంతే కాని గివప్ చేసే వాళ్ళకు కాదు. యుద్ధం లో పోరాడి ఓడాలి అంతే గాని ఓడిపోతాం కదా అని పోరాడని వాడు ఒఠి చవటాయ్ అని నా అభిప్రాయం.
ఇక నా భార్య విషయానికి వస్తే అది నన్ను రోజూ వేపుకు తింటూనే ఉంటుంది, నా తరమా భవ సాగర మీదను నళిన దళేక్షణ రామా .. అని నేనూ కూడా రోజూ పాడుకుంటూనే ఉంటాను. కాబట్టి నాది కడుపు నిండిన బ్రతుకు అనుకోవద్దు. ఎటొచ్చి అది కొట్టినప్పుడు కొట్టింది అని చెప్పుకోను అంతే.
అదీ కాకుండా అమెరికాలో కడుక్కోవటంలేదా అని అల్‍రెడీ చెవులనిండా రత్తం కారేటట్టు పుల్లుగా పడింది కాబట్టి ఇంటికెళ్ళిన తరువాత ఇక ఉండవులేండి. కాబట్టి ఇప్పడికైనా ఒప్పుకోండి ఇవి కడుపు నిండిన యవ్వారం కాదని. మీ స్పందనకు నెనరులు

అజ్ఞాత చెప్పారు...

నేను లేకుండా గొడవలా? అసలేంజరుగుతున్నది? ఏమి జరిగింది? ఏమి జరగబోతున్నది నాకు తెలియాలి తెలియాలి తెలియాలి..

ఓ బ్రమ్మీ చెప్పారు...

ఐదవ అజ్ఞాత గారు,
అదేనండీ నేను చెప్పాను .. చూద్దాం మనోడు అయితే పేరు మార్చుకుంటాడు లేదా భాష మార్చుకుంటాడు. ఏది ఏమైనా నాకన్న ముందే ఈ విషయాన్ని చెప్పినందులకు నెనరులు.

ఆరవ అజ్ఞాత గారు,
కెబ్లాస వారా!!! ఎవ్వరు వారు? నన్ను టార్గెట్ చెయ్యడమేమిటి? నాకు అర్దం కాలేదు. కొంచం వివరించండి. ఇక అమెరికా అచ్చొచ్చిరావటం అనే విషయాలు మన చేతిలో లేవు అప్పటికప్పుడు అయ్యేది అలా జరుగుతుంది .. కాబట్టి డోన్ట్ కేర్.. ఏమైనా మీ సలహాకు థాంక్స్

ఓ బ్రమ్మీ చెప్పారు...

ఆమ్మ వొడి గారికి,

మున్ముందుగా నమస్కారం ఆపై మీ స్పందనకు థాంక్స్ .. ఇలా పుట మాత్రమే కాకుండా కామెంట్స్ కూడా చదివి స్పందించిన మీకు జేజేలు

ఓ బ్రమ్మీ చెప్పారు...

తార గారు,
ఇక్కడ గొడవలేం జరగటం లేదు.. మీకెవరిచ్చారో కాని తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇక్కడ ఏమీ జరగటం లేదు కాబట్టి మీరెందుకొచ్చారో చెప్పండి. వచ్చినందులకు నెనరులు

అజ్ఞాత చెప్పారు...

చక్రవర్తి గారు ఏమిటా ప్రశ్న, టపా రొజూ చదవాలి అనుకొని వీలుగాక చదవటానికి వచ్చాను రాకూడదా?

చక్రవర్తి గారు ఏంటా రాతలు, కోతలు,..ఇవే గనుక స్త్రీ జనోద్దారణ, ఛి, ఛి, తు, తు, వదినోద్దారణ సమితి అధ్యక్షులు మా అన్నగారి చదివితే ఇంకేమైనా ఉన్నదా?? తరువాతి కధలో హీరో ఐపోతారు...

మీ మొదటి పెరాకి, చేతికి అంటితే, మలేరియా, ఫ్లూ,కలరా,. ఇలా రక రకాల రోగాలు వస్తాయి భారతీయులకి లాగా అని ప్రచారం చేసుకున్నారు బ్రెదరు, (మనకి మలేరియా ఎక్కువ కద దాన్ని అలా తెలివిగా వాడుకున్నారులే), ఇక్కడ కుడా అదే మొదలు పెట్టారు తెల్వదా? కానీ మన ఒంట్లో వున్న రోగం, దెన్నో పట్టుకుంటే వత్తదా?? పేపర్ వాడినా చెయ్యి సోప్ పెట్టి కడుక్కోకపోయినా వత్తది..

తరువాత రోజూ ఒకరి మొహమే సూడాలి అంటే బోర్ కొట్టడా? నాకు తెలిసిన ఒక ౭౫ ఏళ్ళ యువతి, ఇల్లు కడుక్కోవటానికి కుడా ఓపిక లేదు కానీ ౬ నెలలకి ఒక బాయ్ ఫ్రెండు, ౬ నెలలు మరీ నచ్చితేనే, ఎంత నచ్చినా ౬ నెలలకి బోర్ కొట్టుద్ది అంట..

మరి ఇలా ౬ నెలలకి ఒకడ్ని మార్చే వాళ్ళు, వాళ్ళకి లచ్చల్ లచ్చల్ పోయాలి అంటే ఎట్టా సెప్పు అందుకే ఎజెండా..

స్వాత్రంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఒక రోజు ముందుగానే..

ఓ బ్రమ్మీ చెప్పారు...

తార గారికి,
ఫైనల్‍గా వీలు చేసుకుని వచ్చి స్పందించినందులకు నెనరులు. రావద్దని కాదు నా అర్దం వచ్చి ఏం గొడవ చేయ్యబోతున్నారు అని.
ఇక నా రాతలు కోతలవిషయానికి వస్తే.. స్త్రీ జనోద్దారణ లేక వదినోద్దారణ సమితీ అద్దెచ్చులు మరియు మీ అన్నోరు సతికితే ఏమి కాదన్న ఇసయం మీకు అర్దం కాలే.. ఏటైతాది .. వీరో కాలపోతే ఇలన్ అయితే మీకేమైనా ఇబ్బందా.. ఏదీ మీ అన్నొరు యాడ ఉంటారో సెప్పండి ఆడికేపోయి మన బాలయ్య డవిలాగ్ ఒకటి కొట్టొస్తా.. ఏటంటారా .. అదేనండి .. నీ ఊరికొచ్చా .. ఛి, ఛి, తు, తు, నీ డొమైన్ కొచ్చా .. నీ బ్లాగు కొచ్చా .. నీ బ్లాగులోని పోస్టు కొచ్చా .. బ్లా బ్లా..
ఏంటీ వరస మార్చి బెదరంటూన్నారు.. ఏం వొల్లెల్ల ఉందేటి.. నేనేటి? నీకు బెదరేంటి? గాడిద గుడ్డేంకాదు.. (అదేదో సినిమాలో ఈ డైలాగ్ చెబుతూ చెయ్యి ఊపుతాడు అలా ఊపానని ఊహించుకోండి)
అదే నా భాధ. అక్కడ కూడా మనోళ్ళు మొదల పెట్టారని.
ఇక ఒకళ్ళ మొహం చూడాలంటే బోర్ కొడుతోందనే అదేదో తెలుగు సామెత పుట్టుకొచ్చింది.. అదేనండి పండగపూట కూడా పాత మొగుడేనా .. వాట్!!!! డెభ్భై ఐదేళ్ళ ఉన్న స్త్రీని మీరు యువతీ అంటున్నారంటే, మీ ఉద్దేశ్యంలో ఆ స్త్రీని ముసలి అని పిలవాలంటే ఎన్నేళ్ళుండాలబ్బా!! అవును .. యువతి కాబట్టి వయస్సులో ఉంది అలా ఎంతమందిని కావాలంటే అంత మందిని కావాలంటే అంత మందిని మారుస్తుంది, మద్దెలో మీకేంటంట!! మీకు లేరని జెలసీనా.. కావాలంటే ఆవిడ వాడి వొదిలేసిన ఒకరిద్దరిని మీకు అప్పజెప్పమంటాగాని ఆ యువతి చిరునామా ఇవ్వండి
ఆఖరుగా సొసంత్రదినోత్సవ శుభాకాంక్షలకు తాంస్.. వాకే!!

అజ్ఞాత చెప్పారు...

>>ఏదీ మీ అన్నొరు యాడ ఉంటారో సెప్పండి ఆడికేపోయి.

పెద్ద తప్పు చేస్తున్నావ్ అప్పా, చానా పెద్ద తప్పు..

>>అక్కడ కూడా మనోళ్ళు మొదల పెట్టారని.

నేను ఇక్కడ అని రాసినట్టు గుర్తే!

>>డెభ్భై ఐదేళ్ళ ఉన్న స్త్రీని మీరు యువతీ అంటున్నారంటే

సంవత్సరానికి ముగ్గిర్ని మారుస్తుంటే యువతేగా అని..
మొదటి, చివరి ప్రశ్నలకు ఇదిగా మా అన్నగారి జవాబు, నా మీద పోలీస్ కేసు, గట్రా ఎటమ్మాకయ్య, ౧౦౮ ఇక్కడైతే, మరి అక్కడో, ఆ నెంబరు గుర్తెట్టుకోమ్మ, ఎమో సెప్పలేము, పక్కన రాసి పెట్టుకోమ్మ సతికేక గుర్తుంటదో లెదో.

http://stories.blogzine.sahityaavalokanam.gen.in/2009/09/blog-post.html

అజ్ఞాత చెప్పారు...

తల్లి నిక్కి లీ కన్నా ఎవరైనా బెటరే :-((
సారీ ఔట్ ఆఫ్ కాంటెక్ష్ట్. ఈనాడు లోని వార్త ప్రభావంతో....

ఓ బ్రమ్మీ చెప్పారు...

తార గారు,

మీ స్పందన చదివిన తరువాత నా మొదటి రియాక్షన్.. తొక్కేంగాదు.. ఆ ఇసయం ప్రక్కన పెట్టి నేనేమి తప్పు సెయ్యలేదే అమ్మీ..

ఈ రిప్లై నీవిచ్చిన లంకెలోని కధ మొత్తం చదివిన తరువాతే వ్రాస్తున్నా. కధని కధగా తీసుకోవడం చేతకాని వాళ్ళు ఏదేదో వాగుతారు. కాబట్టి మనం కధ చదివిన తరువాత వాకే.. నో ప్రాబ్లం .. నెంబర్ పని పడ్లే..

కీప్ కామెంటింగ్.. ఆల్ ద బెస్ట్ టు యు అండ్ టు యువర్ బెద్దొర్.. అదే మీ అన్నోరు..

ఓ బ్రమ్మీ చెప్పారు...

ఏడవ అజ్ఞాత గారు,

నో ప్రాబ్లం .. కీప్ కామెంటింగ్

అజ్ఞాత చెప్పారు...

తార గారు అమ్మీ కాదు ;-) అబ్బీ

ఓ బ్రమ్మీ చెప్పారు...

మానవాణి గారు,

ఇది మీ అభిప్రాయమా.. లేక మీరు గమనించిన విషయమా.. ఏది ఏమైనా స్పందించినందులకు నెనరులు

అజ్ఞాత చెప్పారు...

^^ ఓహ్ అభిప్రాయం కాదండీ! నిజమే.
ఎక్కడో బ్లాగులలో వారి కామెంట్లలోనే కనిపించింది :)
వారి ప్రొఫైలులో మెయిలు ఐడి కూడా ఉంది/ఉండేది

ఓ బ్రమ్మీ చెప్పారు...

మానవాణిగారు,

స్పందించినందులకు నెనరులు .. అలాగే వివరించినందులకు నెనరులు

అజ్ఞాత చెప్పారు...

హ్హవ్వహ్వా ))))

తెలుగు శూరుడు చెప్పారు...

Chakravarthy gaaru,

I am sorry, I think you did not look at my comment properly. I just expressed my disagreement with the attitude of some of the commentators here.

The other thing is, I love and know Telugu (both reading and writing) very well, but long-cultivated habits drive me this way. I will try to follow your kind word of advice,

ఓ బ్రమ్మీ చెప్పారు...

snkr గారికి,

వచ్చి నవ్వి పోయినందులకు నెనరులు ..

తెలుగు శూరుడి గారికి,

మీ భావం నాకు అర్దం అయ్యింది, మిమ్మల్ని తప్పుగా అర్దం చేసుకున్నందులకు నెనరులు. బ్లాగులోని స్పందనలకు స్వతహాగా బ్లాగు ఓనర్ స్పందిస్తారు ఆ విధంగా మీరు ఉంచిన ప్రశ్నలు నన్ను ఉద్దేశ్శించినవని తలచాను.
వివరించినందులకు నెనరులు, కాకపోతే తెలుగు వ్రాయకపోవడానికి మీరు కారణాలు వెతుక్కుంటున్నారేమో అని పిస్తోంది. మీరు భావాన్ని ఆంగ్లంలోనే వ్యక్త పరచండి, బట్ యు స్టిల్ కెన్ రైట్ ఇన్ తెలుగు.. ఈజ్ ‍ఇన్ట్ ‍ఇట్.. ట్రై రైంటింగ్ యువర్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇన్ తెలుగు. హోప్ దట్ వుడ్ గివ్ యు సమ్ ప్రాక్టీశ్
ట్రైమీ.. అనీహౌ .. థాంక్స్ ఫర్ మేకింగ్ మీ అండర్ స్టాండ్ యు

అజ్ఞాత చెప్పారు...

"While this author craves for a healthy family system and a conducive atmosphere, why do some want to divert the topic to extreme and rare criminal situations ? Why do they subject him to verbal abuse without substantiating their criticism with proper data inputs and logic ?"

ఇది మీరు చదవలేదా. చదివినా అర్థం కాలేదా? స్పందించేముంది సరిగా చూసుకోవాలి కదండి.
@తెలుగు శూరుడు గారు, చక్రవర్తి గారు తీవ్రంగా స్పందించినా మీరు తిరిగి స్పందించిన తీరు బాగుంది.

అజ్ఞాత చెప్పారు...

భార్యని మీరు ప్రైవేటుగా అది అన్నా, ఇలా అందరిముందూ పలుసార్లు అది, అది అనడం ఏమీ బాగాలేదు.

ఓ బ్రమ్మీ చెప్పారు...

ఎనిమిదవ అజ్ఞాత గారు,

నాకు తెలుగే సరిగ్గా రాదు అలాంటప్పుడు ఆంగ్లంలో వ్రాస్తే ఏం అర్దం అవుతుంది. అందువల్ల వీరు వ్రాసినది అర్దం కాలేదు. కాకపోతే వీరి స్పందనకు నా ప్రతి స్పందన చూసే ఉంటారు లేకపోతే మరోసారి చదవండి. ఏమైనా మీ మెచ్చుకోలు బాగుంది, స్పందించేవాళ్ళను కూడా ఎంకరేజ్ చెసినందులకు నెనరులు.

తొమ్మిదవ అజ్ఞాత గారు,
నా పెళ్ళాం నా ఇష్టం .. నేనేమైనా అంటా నువ్వెవ్వడివి నన్ను మరియు నేను సంబోధించే విషమై ప్రశ్నించడానికి అని నేను అనను. అలాగే భార్య విషయంలో నేను వ్రాసినది అంతా నిజమని మాత్రం మీరు అనుకోకండి. నా భార్య గురించి ఇక్కడ మంచిగా వ్రాసినంత మాత్రాన తను మంచిదవదు అలాగే చెడుగా వ్రాసినంత మాత్రాన తనేమి నన్ను రాచి రంపాన పెట్టదు. కాకపోతే మీరు టచ్ చేసిన విషయం చాలా సున్నితమైనది, ఇకపై ఆ పద ప్రయోగం మార్చుకుంటాను. గుర్తించినందుకు నెనరులు

Mike చెప్పారు...

while in rome, be a Roman , if you dont like america.. get lost !! But dont comment on other ppl cultures and behaviours. You and your behaviours may look stupid to many americans does that mean U R STUPID?

అజ్ఞాత చెప్పారు...

mike
just becoz in rome, u need not lick their ass u got wht i mean? many us citzs criticize us, doesn't mean they r soviets idiot.

Mike చెప్పారు...

Orey agnath fool

You are licking everyones ass..My point is if you are a guest in a house/country you have to obey and accept & get adjusted to their customs. Otherwise go to your well and live like a frog. HOPE..U got what I mean..

అజ్ఞాత చెప్పారు...

I completely agree with Mike.

అజ్ఞాత చెప్పారు...

I too agree with Mike, If you dont like US, why should u even go there? Everybody have thier own cultures/routines.It all depends lot of cimate/environmental factors.

As per ur post, you have been in US for not even an Year, I dont think yor are in a position to see a complete picture..

Sometimes its better to seperate instead of pretending to be happy.
Also, not all the americans get divorced...There are lot of ppl who are happily married for life, just like us indians.

I am aware this is purely your personal opinion, but since you made ur opinion public, I had to write that ur opinion is entirely correct.

అజ్ఞాత చెప్పారు...

Correction - I had to write that ur opinion is 'NOT' entirely correct.

అజ్ఞాత చెప్పారు...

బాబూ MIKE, ప్రతి వ్యక్తికీ భావప్రకటణ స్వేచ్ఛ ఉంది. అమెరికా వారు భారతీయులని ఇంతకంటే వంద రెట్లు ఎక్కువ తిడతారు. ఈ పుటలో రాసినవి అక్షర సత్యాలు. మీరు సొంత జాతిని, ధర్మాన్ని వ్యతిరేకించి అమెరికా వాడి ముడ్డి నాకుతున్నారు. అలాగని మీకు అమెరికా వాడు సమానంగా గౌరవమిస్తాడా, తొక్క కూడా ఇవ్వడు. మిమ్మల్ని ఒక పనికిమాలిన వెధవగా చూస్తాడు. మీకు నచ్చనంత మాత్రాన చక్రవర్తి గారు బ్లాగులు రాయకూడంటే కుదరదు. While in rome, be a roman. అని రాశారు కదా, మరి మీరు ఇంకా తెలుగు బ్లాగులు ఎందుకు చదవుతున్నారు. మీ అమెరికా ప్రభువుల ఆంగ్ల భాష మీద దృష్టి పెట్టండి. వారికి ఊడిగం చేస్తూ అమెరికన్లు భారతీయుల కంటే గొప్పవారిని చెప్పుకుంటూ ఆనందించండి. వీలైతే కాస్త ఆత్మనూన్యత తగ్గించుకుని, ఆత్మాభిమానాన్ని పెంచుకోండి.

అజ్ఞాత చెప్పారు...

identandi? paavalaa kodi ki muppaavalaa disthi laa intha discussion?ha ha ha.

ఓ బ్రమ్మీ చెప్పారు...

మైక్,

ముందుగా స్పందించినందులకు నెనరులు. అవునండి, ఈ నానుడిని నేను చాలా సార్లు వాడాను అలాగే ఉపయోగించాను కూడా. ఇక్కడ నేను ఎవ్వరినీ నిందించలేదు, నాకు అర్దం కావేమో అని వాపోయ్యాను మాత్రమే అని తమరు గమనించాలి. అది గమనించకుండా, ఎవేవో వ్రాస్తున్నారు. అలాగే మీరన్నది నిజమేనండి. నాగురించి ఎవ్వరైనా స్టుపిడ్ అని వ్రాసినంత మాత్రాన నేను స్టుపిడ్ అవుతానా అన్న ప్రస్నకి నాది ఒకటే సమాధానం, పిచ్చివాడి వద్దకు వెళ్ళి ఒరేయ్ నువ్వు పిచ్చోడివి అంటే వాడు ఒప్పుకుంటే వాడు పిచ్చోడు కాదు. ఒప్పుకోకపోతేనే పిచ్చోడు అవుతాడు, అలా నేను స్టుపిడ్ అని ఎవ్వరైనా అంటే, ఒప్పుకోనేమో!!

Hope you got my point.. did ya?

ఓ బ్రమ్మీ చెప్పారు...

పదవ అజ్ఞాత గారు,

ఈ ఒక్క విషయంలో నాకు భలే కోపం వస్తుందండి, వాడెవ్వడో మాత్రం భారతీయులను పాములు పట్టేటోళ్ళు అని యదవ వ్రాతలు వ్రాయవచ్చా, మనం మాత్రం నిజాలు వ్రాయకూడదా.. మీకు నా ఫుల్ సపోర్ట్..

Anyway, thanks for supporting and keep commenting

ఓ బ్రమ్మీ చెప్పారు...

Mike,

You are crossing the limits. You dont have any right to use filthy words to any one who criticize you. You need to remember that we are in the state of expressing our feeling without fear. If you dont like any person's comment, you better caution them and ignore them. But you can't disrespect others.

ఓ బ్రమ్మీ చెప్పారు...

పదకొండవ అజ్ఞాత గారు,

మైక్ వాడిన అసభ్య పదజాలానికి నేనిచ్చిన స్పందన మీకు కూడా వర్తిస్తుంది.

పన్నెండవ అజ్ఞాతగారు,

మైక్ కి నేనిచ్చిన మొదటి స్పందన మీకు వర్తిస్తుంది. ఇక నేనెందుకు అమెరికా వచ్చాను అన్న మీ ప్రశ్నకి సమాధానం.. ఇది పూర్తిగా వ్యాపార పర్యటన, నా కంపెని ఇక్కడి వ్యాపారికి ఏదో పని చేసిపెట్టి రమ్మంటే వచ్చాను. అంతే కాని విహార యాత్ర కాదు .

అలాగే మీరు కనుక నా పాత పోస్టులు చదివితే, ఒక చోట నేను ఇలా వ్రాసుకున్నట్టు గుర్తు, ".. ఎప్పుడో వచ్చి పోయే నాకు ఇక్కడి విషయాలు పూర్తిగా ఎలా తెలుస్తాయి .." అని. ఆ విధంగా నాకు తెలిసినది చాలా తక్కువే కాబట్టి తమరు కూడా ఆ విధంగా తలచుకోవాలి.

ఆఖరిగా నా ఒపీనియన్ తప్పు అన్ని స్పందించినందులకు నెనరులు. కాకపోతే, ఒక్క సారి మీ చుట్టూ ఉన్న అమెరికన్లలో ఎంత మంది విడాకులు తీసుకున్నారో, ఎంత మంది ఒకటి కన్నా ఎక్కువ రిలేషన్స్ కలిగి ఉన్నారో శోధించండి. అప్పుడు మీకే తెలుస్తుంది

ఓ బ్రమ్మీ చెప్పారు...

పన్నెండొవ అజ్ఞాత గారు,

వివరంగా తెలుగులో స్పందించారు. కొన్ని విషయాలలో నేను మీ అంత కఠినంగా వ్రాయలేక పోయినా, మీరు కొంచం ఘాటుగా స్పందించారు. నా భాధని మీ మాటల్లో చూసుకున్నాను. స్పందించి సమర్ధించినందులకు నెనరులు.

ఓ బ్రమ్మీ చెప్పారు...

పదమూడవ అజ్ఞాత గారు,

పావలా కోడికి ముప్పావలా మసాలా దట్టించబట్టే కదా కూర ఇంత కాలం చెడిపోకుండా ఉండగలిగింది.. ఏమంటారు?

timepassguru చెప్పారు...

అంతగా అమెరికాని ద్వేషించే వాళ్ళు అక్కడకి ఎందుకు వెళ్ళినట్లు...ఇండియా లోనే ఉండవచ్చు కదా

 
Clicky Web Analytics